- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. పరుగులు తీసిన ప్రయాణికులు
నెల్లూరు రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. టికెట్ కౌంటర్(Ticket Counter) వద్ద ఒక్కసారిగా అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. సర్వర్ రూమ్‌లో మంటలు చెలరేగాయి....

X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు రైల్వే స్టేషన్(Nellore Railway Station)లో షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. టికెట్ కౌంటర్(Ticket Counter) వద్ద ఒక్కసారిగా అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. సర్వర్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. లోపల పని చేస్తున్న సిబ్బంది, కౌంటర్ వద్ద ఉన్న ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక కేంద్రానికి వెంటనే సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం టికెట్ కౌంటర్లలో యధావిధిగా విక్రయాలు జరిగాయి. ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






