Breaking: జీపు బీభత్సం.. ముగ్గురు దుర్మరణం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-14 11:45:49  IST  )

వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

Breaking: జీపు బీభత్సం.. ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కడప జిల్లా(YSR Kadapa District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఒంటిమిట్ట మండలం నడింపల్లి వద్ద జీపు(Jeep) బీభత్సం సృష్టించింది. అతివేగంగా ఆర్టీసీ బస్సు(RTC Bus)తో పాటు బొలేరో(Bolero వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జీపులో ఉన్న నలుగురు ప్రయాణికుల్లో ముగ్గురు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జీపు అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story