ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-16 10:18:38  IST  )

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరొకరి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు...

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. బైక్‌(Byke)ను కారు(Car) ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరొకరి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అద్దంకి మండలం చక్రాయపాలెం(Chakrayapalam) సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా కొందరు డ్రైవర్లు, యాజమానులు నిబంధనలు పాటించడంలేదని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని మండిపడ్డారు. వాహనదారులు కచ్చితంగా ట్రాపిక్ రూల్స్ పాటించాల్సిందేనని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిదానమే ప్రధానం అనే నినాదాన్ని ప్రతి వాహనదారులు పాటించాలని సూచించారు.

Next Story