పెందుర్తి సరిపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

విశాఖ జిల్లా పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

పెందుర్తి సరిపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా పెందుర్తి(Visakhapatnam District Pendurthi)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సరిపల్లి హైవే రోడ్డుపై బైక్(byke) అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు పెందుర్తికి చెందిన అవినాశ్, శ్రీరామ్‌గా గుర్తించారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో అవినాశ్, శ్రీరామ్‌ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎప్పుడూ ఉత్సాహంగా కనిపించిన ఇద్దరు యువకులు ఇక లేరని తెలిసి స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు.

మరోవైపు రోడ్డు ప్రమాదాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలువురు వాహనదారులతో సమావేశ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారాలపై దిశానిర్దేశం చేశారు. డ్రైవింగ్ చేసే సమయంలో మద్యం తాగకూడదని తెలిపారు. అతివేగం అసలు వద్దని చెప్పారు. ట్రాఫిక్, రోడ్ రూల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు. బైక్ పై వెళ్లేటప్పుడు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు తెలిపారు.

Next Story