- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఆరుగురు స్పాట్ డెడ్
కర్ణాటకలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

X
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక(Karnataka)లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు(APSRTC bus)ను లారీ(Lorry) ఢీ కొట్టింది. ఈ ఘటనలో మూడు నెలల చిన్న పాపతో పాటు ఆరుగురు స్పాట్‌లోనే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. వీరిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు, క్షతగాత్రులు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వాసులుగా గుర్తించారు. ఏపీ నుంచి బెంగళూరు వెళ్తుండగా కర్ణాటక రాష్ట్రం హొస్కెటో వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ స్పందించారు. వెంటనే అక్కడి పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి రాంప్రసాద్ ఆదేశించారు.
Next Story






