ఘోర ప్రమాదం: టీచర్ మృతి, మరో ఇద్దరికి గాయాలు

by Vemula.Srinu Prasad |

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

ఘోర ప్రమాదం: టీచర్ మృతి,  మరో ఇద్దరికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా(Kadapa)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గిలేటిపల్లె(Buggiletipalle)లో రెండు కార్లు(Cars) ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ కారులో ఉన్న టీచర్(Teacher) మృతి చెందారు. మరో కారులో ఉన్న ఇద్దరు ప్రభుత్వ వైద్య ఉద్యోగులకు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. టీచర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ముందున్న వాహనాన్ని తప్పించబోయిన కారు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీంతో అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story