Breaking: ఘోర ప్రమాదం.. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దుర్మరణం

by Vemula.Srinu Prasad |

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

Breaking: ఘోర ప్రమాదం.. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దుర్మరణం
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamaya District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. సంబేపల్లి మండలం(Sambepalli Mandal) యర్రగుంట్ల(Yarraguntla) వద్ద రెండు కార్లు(Cars) ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో హెచ్ఎన్ఎస్ పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ(Special Deputy Collector Rama) మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రాయచోటి కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. మృతి చెందిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో పీలేరు రెవెన్యూ శాఖలో విషాదం చోటు చేసుకుంది.

Next Story