- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ-జీపు ఘోర ప్రమాదం: ముగ్గురు భక్తుల మృతి
by Vemula.Srinu Prasad |
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. తిప్పాయపాలెం వద్ద జీపును అరటికాయల లోడు లారీ ఢీకొట్టింది. ..

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam District ) మార్కాపురం సమీపం(Markapuram)లో ఘోర ప్రమాదం జరిగింది. తిప్పాయపాలెం వద్ద జీపును అరటికాయల లోడు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శ్రీశైల మల్లన్నను దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాద జరిగింది. అయితే ఈ ఘటనలో జీపు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ముగ్గురు వ్యక్తులు మాత్రం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతులు కర్ణాటక వాసులు
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు కర్ణాటక వాసులిగా గుర్తించారు. తీర్థయాత్రలో భాగంగా శ్రీశైలం వెళ్లి తిరిగి వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రమాదానికి గురైయ్యారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






