విశాఖలో కుప్ప కూలిన భవనం: ఒకరు మృతి.. శిథిలాల కింద ముగ్గురు..!

by Vemula.Srinu Prasad |

విశాఖపట్నం గాజువాక పరిధిలోని వికాస్‌నగర్‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనాన్ని జాకీల సహాయంతో పైకి లేపుతున్న (లిఫ్టింగ్) క్రమంలో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది....

విశాఖలో కుప్ప కూలిన భవనం: ఒకరు మృతి.. శిథిలాల కింద ముగ్గురు..!
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం(Visakha) గాజువాక పరిధిలోని వికాస్‌నగర్‌(Vikasnagar)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనాన్ని(Building) జాకీల సహాయంతో పైకి లేపుతున్న (లిఫ్టింగ్) క్రమంలో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, భవన శిథిలాల కింద మరో ముగ్గురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించి లోపల ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Next Story