- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: కూల్ డ్రింక్స్ షాపులోకి దూసుకెళ్లిన కారు.. బీభత్సం
కర్నూలు జిల్లా పత్తికొండలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి రోడ్డులో అతివేగంగా వెళ్లిన కారు అదుపుతప్పి సమీపంలోని కూల్‌డ్రింక్ షాపులోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ...

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kurnool District) పత్తికొండ(Pattikonda)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తి రోడ్డు(Gutti Road)లో అతివేగంగా వెళ్లిన కారు అదుపుతప్పి సమీపంలోని కూల్‌డ్రింక్ షాపులోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడే టీ తాగుతున్న రేఖానాయక్ అనే వ్యక్తి.. కారు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విచారణ చేపట్టిన పోలీసులు
ప్రమాదానికి కారణమైన వాహనం బెంగళూరుకు చెందినదిగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కారులో ఇద్దరు చిన్నారులతో పాటు డ్రైవర్ ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, డ్రైవర్ అజాగ్రత్త వల్ల ప్రమాదం జరిగిందా లేదా సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో షాపు వద్ద జనం తక్కువగా ఉండటంతో పెద్ద ముప్పు తప్పిందని స్థానికులు తెలిపారు.






