Breaking: కారులో మంటలు.. దంపతులు సజీవ దహనం

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-22 10:20:25  IST  )

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పనపాకం వద్ద ఘోర ప్రమాదం జరిగింది....

Breaking: కారులో మంటలు.. దంపతులు సజీవ దహనం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా(Tirupati) చంద్రగిరి మండలం పనపాకం(Panapakam) వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న కారు(Car) ఒక్కసారిగా అదుపు తప్పి డివెడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. అయితే ఈ మంటల్లో దంపతులు చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రామాపూరం పంచాయతీ కుప్పిగానిపల్లెకి చెందిన సిద్దయ్య కుటుంబం కారులో తిరుమల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిద్దయ్య పుట్టిన రోజు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని తిరిగి పయనంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో భార్య జ్యోతి సహా సిద్దయ్య మృతి చెందారు. వారి కూతురు, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. కుమారుడు గిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిద్దయ్య మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రైవేటు గన్ మెన్‌గా పని చేశారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.

Next Story