ధర్మవరం ఆర్డీవో ఆఫీస్ వద్ద రైతు కిడ్నాప్: సినీ ఫక్కీలో రక్షించిన పోలీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-08 12:26:18  IST  )

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఆర్డీవో కార్యాలయం వద్ద శుక్రవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన రైతు నారాయణ ఓ భూ వివాదం కేసు విచారణ నిమిత్తం కార్యాలయానికి వెళ్లారు...

ధర్మవరం ఆర్డీవో ఆఫీస్ వద్ద రైతు కిడ్నాప్: సినీ ఫక్కీలో రక్షించిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా(Sri Satyasai District) ధర్మవరం ఆర్డీవో కార్యాలయం(Dharmavaram Rdo Office) వద్ద శుక్రవారం సంచలన ఘటన చోటుచేసుకుంది. ముదిగుబ్బ మండలం(Mudigubba Mandal)కమ్మవారిపల్లి(Kammavaripalli)కి చెందిన రైతు నారాయణ ఓ భూ వివాదం కేసు విచారణ నిమిత్తం కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆయనను ప్రత్యర్థి రవీంద్ర, అతని అనుచరులు బలవంతంగా ఇన్నోవా వాహనంలో తీసుకెళ్లారు. కార్యాలయం బయటే అందరూ చూస్తుండగా జరిగిన ఈ కిడ్నాప్‌తో స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

సురక్షితంగా రైతు

సమాచారం అందుకున్న వెంటనే ధర్మవరం పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. కిడ్నాపర్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని రామగిరి వైపు వెళ్తుండగా పోలీసులు సినిమా స్టైల్‌లో వెంబడించి అడ్డుకున్నారు. నిందితుల నుంచి రైతు నారాయణను సురక్షితంగా రక్షించారు. ప్రధాన నిందితుడు రవీంద్రతో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణాపాయం నుంచి రైతును కాపాడిన పోలీసుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Next Story