- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులివెందులలో సంచలన సంఘటన.. వివేకా హత్య కేసు నిందితుడిని వెంబడించిన అవినాశ్ అనుచరులు
కడప జిల్లా పులివెందులలో సంచలన సంఘటన చోటు చేసుకుంది

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా పులివెందుల(Pulivendula)లో సంచలన సంఘటన చోటు చేసుకుంది. ఎంపీ అవినాశ్ రెడ్డి(Mp Avinash Reddy) అనుచరులు హల్ చల్ చేశారు. వివేకానందారెడ్డి హత్య కేసు(Vivekananda Reddy Murder Case) నిందితుడు సునీల్ యాదవ్‌ను వెంబడించారు. పులివెందులలో కుటుంబంతో కలిసి గుడికి వెళ్లి తిరిగి వెళ్తుండగా సునీల్ యాదవ్ కారును అవినాశ్ అనుచరులు అనుసరించారు. దీంతో పులివెందుల పీఎస్‌లో సునీల్ యాదవ్ కుటుంబం ఫిర్యాదు చేసింది. అవినాశ్ అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు.
కాగా 2019 ఎన్నిలకు ముందు వైఎస్ జగన్ బాబాయ్ వివేకానందారెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్‌ను గతంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై వచ్చారు. పులివెందులలో తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వివేకానందారెడ్డి వాచ్ మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలంతో సునీల్ కుమార్ యాదవ్ పేరు బయటకు వచ్చింది. దీంతో ఆయన్ను సీబీఐ అధికారులు విచారించారు. అయితే విచారణలో సునీల్ కుమార్ యాదవ్ కీలక విషయాలు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన వెంట అవినాశ్ రెడ్డి అనుచరులు వెంబడించారనే ప్రచారం జరుగుతోంది.






