- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: 15 మంది వైసీపీ నేతల అరెస్ట్
ప్రకాశం జిల్లా పొదిలి ఘటనలో సంచలన పరిణామం చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా(Prakasam) పొదిలి(Podili) ఘటనలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) పొదిలి పర్యటనలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన కేసులో 15 మంది వైసీపీ(Ycp) నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.
కాగా ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటించారు. అయితే అంతకుముందు పొదిలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని మహిళలను కించపరుస్తూ సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించడంపై స్థానిక నాయకులు, మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ సతీమణి భారతీ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. రోడ్డు పక్కన ఆందోళన నిర్వహిస్తున్న మహిళలపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులు సైతం గాయపడ్డారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను గుర్తించారు. ఇప్పటి వరకూ పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా 15 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.






