- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేయర్‌పై అవిశ్వాసం.. 19న బల పరీక్ష
by Vemula.Srinu Prasad |
జీవీఎంసీలో సంచలన పరిణామం చోటు చేసుకుంది..

X
దిశ, వెబ్ డెస్క్: జీవీఎంసీలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదిపింది. దీంతో మేయర్ హరివెంకట కుమారిపై కలెక్టర్‌కు కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. దీంతో అవిశ్వాస పరీక్ష కోసం ఈ నెల 19న జీవీఎంసీ పాలకమండలి సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం అందించింది. అవిశ్వాసం ఎదుర్కొనున్న తొలి మేయర్గా హరివెంకట కుమారి నిలవనున్నారు. బల పరీక్షలో టీడీపీ నెగ్గాలంటే 75 మంది బలం అవసరం. 34 మంది కార్పొరేటర్లను వైసీపీ ఇప్పటికే బెంగళూరుకు తరలించారు. టీడీపీ క్యాంప్ రాజకీయాలకు దూరంగా జనసేన ఉంది. ఈ బలపరీక్షలో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలి.
Next Story






