- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బర్రెలు అడ్డొచ్చి హైవేపై రోడ్డు ప్రమాదం
పరిస్థితులు బాగాలేకపోతే గడ్డిపరక కూడా ప్రాణాంతకంగా మారుతుంది. అదే కోవలో పశువులు కూడా ప్రాణాలు పోయేంతటి ప్రమాదాలకు కారణమవుతుంటాయి.

దిశ, వెబ్ డెస్క్ : పరిస్థితులు బాగాలేకపోతే గడ్డిపరక కూడా ప్రాణాంతకంగా మారుతుంది. అదే కోవలో పశువులు కూడా ప్రాణాలు పోయేంతటి ప్రమాదాలకు కారణమవుతుంటాయి. ఇప్పటి వరకు రోడ్డు ప్రమాదాలకు (Road Accidents) కారణంలో వీధి కుక్కలు ముందుండగా.. ఇప్పుడు జాబితాలోకి బర్రెలు కూడా వచ్చి చేరినట్లు తెలుస్తోంది.బర్రెలు అడ్డొచ్చిన కారణంగా ఓ ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురైన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని సీతారామపురం మండలం పరిధిలో ఉన్న బసినేనిపల్లి (Basinenipalli) డాబా ప్రాంతంలో జరిగింది.
మర్రిపాడు మండలంలోని రాజుపాలెం గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్ మంగళవారం తన అత్తగారి ఇంటికి బైకుపై బయలుదేరాడు. హైవేపై ప్రయాణిస్తూ అత్తగారి ఊరైన దేవమ్మ చెరువుకు ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో హైవేపై ప్రయాణిస్తూ బసినేనిపల్లి డాబా ప్రాంతానికి సమీపించాడు.చీకటిలో అటుగా వస్తున్న బర్రెలను గమనించి కంగారుపడ్డాడు. వాటిని తప్పించే క్రమంలో బైకు అదుపు తప్పింది. దీంతో బైకుపై నుంచి ప్రసన్నకుమార్ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని తలకు స్వల్ప గాయాలయ్యాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 ఆంబులెన్స్ ను రప్పించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అదే ఆంబులెన్స్ లో తదుపరి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.






