సిమెంట్ లోడ్ లారీ బీభత్సం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 14 మందికి గాయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-18 13:51:01  IST  )

శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడు మండలం పులగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది...

సిమెంట్ లోడ్ లారీ బీభత్సం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 14 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా(Sri Satyasai District) నల్లమాడు(Nallamadu) మండలం పులగంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు(Rtc Bus)ను సిమెంట్ లోడ్ లారీ(Lorry) ఢీకొట్టింది. దీంతో 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరందరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీ అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE ....

ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం: పొగమంచు వల్ల వాహనాల ఢీ.. ఇద్దరు సజీవ దహనం

Next Story