- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూటీని ఢీకొట్టిన బస్సు.. ఇద్దరు స్పాట్ డెడ్
తిరుపతి జిల్లా పూడి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ...

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా పూడి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు నాగరాజు (65), చక్రవర్తి (60)గా గుర్తించారు. స్కూటీ పూడి క్రాస్ జంక్షన్ దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం జరిగిన రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద వార్తతో మృతుల కుటుంబాలలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఇద్దరు వ్యక్తులు ఇలా అకాల మరణం చెందడాన్ని బంధువులు, స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.






