- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో రేవ్ పార్టీ కలకలం.. ఐదుగురు యువతులు, 14 మంది యువకుల అరెస్ట్
తూర్పు గోదావరి జిల్లా బూరుగుపూడిలో రేవ్ పార్టీ కలకలం రేపింది....

X
దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా బూరుగుపూడిలో రేవ్ పార్టీ(Rave party) కలకలం రేపింది. స్థానిక కల్యాణమండపంలో రేవ్ పార్టీ నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామువరకూ మందు, విందు, చిందులతో రేవ్ పార్టీ దద్దరిల్లింది. విషయం తెలుసుకున్న పోలీసులు రైవ్ పార్టీపై దాడి చేశారు. ఐదుగురు యువతులు, 14 మంది యువకులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా స్థానికంగా పురుగు మందు షాపుల యజమానులకు చెందిన వారిగా గుర్తించారు. నూతన సంవత్సరం సందర్భంగా రేవ్ పార్టీ నిర్వహించినట్లు నిర్ధారించారు. పార్టీకి అనుమతి లేకపోవడంతో తదుపరి చర్యలపై ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
Next Story






