బీచ్‌ను ముద్దాడిన ఆకాశం.. విశాఖ బీచ్‌లో అరుదైన దృశ్యం

by Ajay Maddhiboyina |

విశాఖ బీచ్ రోడ్డులో అరుదైన దృశ్యం కనిపించింది. వాతావరణం పూర్తిగా మారిపోవడంతో ఒక్కసారిగా నల్లమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో బీచ్ రోడ్డులో సముద్రం ఆకాశం కలిసినట్టుగా సన్నివేశాలు కనిపించాయి.

బీచ్‌ను ముద్దాడిన ఆకాశం.. విశాఖ బీచ్‌లో అరుదైన దృశ్యం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ బీచ్ రోడ్డులో అరుదైన దృశ్యం కనిపించింది. వాతావరణం పూర్తిగా మారిపోవడంతో ఒక్కసారిగా నల్లమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో బీచ్ రోడ్డులో సముద్రం ఆకాశం కలిసినట్టుగా సన్నివేశాలు కనిపించాయి. మరోవైపు సాయంత్రమే చీకటిపడిపోయింది. దీంతో బీచ్ మబ్బులు బ్లాక్ అండ్ వైట్ గా కనిపిస్తూ ఆకట్టుకున్నాయి. ఈ అరుదైన విజువల్స్ చూస్తూ పర్యాటకులు ఎంజాయ్ చేశారు. తమ ఫోన్ కెమెరాలలో అందమైన చిత్రాలను బంధించారు. ఇక కేవలం వైజాగ్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. తిరుపతి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. నగరిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.

విద్యుత్ సరఫరాకు సైతం అంతరాయం ఏర్పడింది. పుత్తూరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ రోజు వర్షం కురిసినప్పటికీ గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు కూడా వడగాలుల తీవ్రత ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, పల్నాడు, పశ్చిమగోదావరి, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూ.గో, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Next Story