Viral News:రాష్ట్రంలో అరుదైన ఘటన.. 68 ఏళ్ల బామ్మను పెళ్లాడిన వ్యక్తి!

by Jakkula.Mamatha |   (  Updated:2025-01-18 14:36:16  IST  )

రాష్ట్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుత కాలంలో యువతి, యువకులు ప్రేమ(Love)లో పడి వివాహాలు చేసుకోవడం తెలిసిన విషయమే.

Viral News:రాష్ట్రంలో అరుదైన ఘటన.. 68 ఏళ్ల బామ్మను పెళ్లాడిన వ్యక్తి!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుత కాలంలో యువతి, యువకులు ప్రేమ(Love)లో పడి వివాహాలు చేసుకోవడం తెలిసిన విషయమే. కానీ ఏపీలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. గత కొంత కాలంగా వృద్ధాశ్రమం(Nursing Home)లో జీవిస్తున్న 64 ఏళ్ల తాత, 68 ఏళ్ల బామ్మ‌ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. ఒక‌రిని ఒక‌రు విడిచి ఉండలేనంతగా ఇష్ట‌ప‌డ్డారు. ఈ క్రమంలో లేటు వయసులో పెళ్లి చేసుకుని ఒకరికొకరు తోడు నీడగా నిలవాలని నిర్ణయించుకున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. ఏపీ(Andhra Pradesh)లోని రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో నారాయణపురానికి చెందిన మడగల మూర్తి (64) రెండేళ్లుగా ఉంటున్నారు. అదే ఆశ్ర‌మంలో వైఎస్‌ఆర్‌ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన గజ్జల రాములమ్మ (68) అనే వృద్ధురాలు కూడా ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల‌ క్రితం ఉన్న‌ట్టుండి మూర్తి(Murti) పక్షవాతానికి గురయ్యారు. లేవ‌లేని పరిస్థితిలో ఉండేవారు. అలాంటి సమయంలో ఆయ‌న‌కు రాములమ్మ తోడుగా నిలబడ్డారు. అన్నివేళ‌లా అండ‌గా ఉంటూ అన్నీ తానై మూర్తికి సేవలు చేసింది.

దీంతో ఆయన తొందరగా కొలుకున్నారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మూర్తికి వయసులో ఉన్నప్పటికంటే కూడా వయసుపైబడిన ఈ వయసులో ఒక తోడు అవసరం అని భావించాడు. తాను మంచాన ప‌డిన‌ప్పుడు తనకు సేవలు చేసిన‌ రాములమ్మను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఆయ‌న‌ రాములమ్మ(Ramulamma)తో చెప్పారు. ఆమె కూడా ఒప్పుకుంది. దాంతో ఇద్ద‌రు తమ‌ నిర్ణయాన్ని ఆశ్రమ నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు చెప్ప‌డంతో ఆ వృద్ధ జంటకు ఆశ్రమంలోనే వివాహం చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Next Story