- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమెరికాలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం
ఆంధ్రప్రదేశ్ వాసికి అరుదైన గౌరవం దక్కింది.

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ వాసికి అరుదైన గౌరవం దక్కింది. విశాఖ(Visakhapatnam)కు చెందిన వెంకట చరణ్(Venkata Charan ) తయారీ రంగంలో అత్యంత కీలకమైన ఫ్రిక్షన్ వెల్డింగ్(Friction Welding) పై చేసిన పరిశోధన అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చింది. దాన్ని 25 దేశాలు గుర్తించాయి. ఈ రంగంలో వెంకట చరణ్ చేస్తున్న కృషికి మెచ్చిన అమెరికా ప్రభుత్వం(US Government) అరుదైన గుర్తింపు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన చేసిన పరిశోధనలకు గానూ అమెరికా ప్రభుత్వం ఈబీ-1 గ్రీన్‌కార్డు(EB-1 Green Card)ను అందజేసింది. ఏదైనా రంగంలో అసాధారణ ప్రతిభ చూపిన వారికి మాత్రమే అమెరికా ఈ ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది. ఈ గౌరవం తెలుగు వ్యక్తికి దక్కడం విశేషం. ప్రస్తుతం ఓ ప్రముఖ ఎలక్ట్రిక్ సంస్థలో సీనియర్ డైరెక్టర్ ఆఫ్ క్వాలిటీ హోదాలో వెంకట చరణ్ పనిచేస్తున్నారు.
ఈబీ-1 గ్రీన్‌కార్డ్..
ఈబీ-1 గ్రీన్‌కార్డ్‌ను ఏదైనా ఒక రంగంలో అసాధారణమైన ప్రతిభ కనబరిచిన విదేశీయులకు అమెరికా ఇచ్చే ‘‘శాశ్వత నివాస హోదా’’. సాధారణంగా నోబెల్ బహుమతి గ్రహీతలు, ఒలింపిక్స్ పతక విజేతలు, ఆస్కార్ అవార్డు గ్రహీతలు, ప్రతిభావంతులకు మాత్రమే అమెరికా ఈ ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. అయితే.. దీని కోసం దరఖాస్తు చేసుకున్న వందలాది మంది నిపుణులలో ఏపీలోని విశాఖ వాసి వెంకట చరణ్ ఒకరు. ఈ క్రమంలో ఆయన పరిశోధనల ప్రాముఖ్యత, అంతర్జాతీయంగా ఆయనకున్న పేరును పరిగణనలోకి తీసుకుని అమెరికా ప్రభుత్వం ఈ గ్రీన్‌కార్డుకు ఎంపిక చేసింది.






