Chandrababu Naidu/Daggubati : అరుదైన ఘట్టం...తోడళ్లుల్లు చంద్రబాబు..దగ్గుబాటిల భేటీ!

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-25 07:42:51  IST  )

ఓ పుస్తకం(A Book) 3 దశాబ్దాల తర్వాత ఆ ఇద్దరు తోడల్లుళ్ల( Two In-laws)ను కలిపింది(Combined Meeting). దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అల్లుళ్లు సీఎం చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు చాల ఏళ్ల తర్వాతా తర్వాతా కలుసుకున్నారు.

Chandrababu Naidu/Daggubati : అరుదైన ఘట్టం...తోడళ్లుల్లు చంద్రబాబు..దగ్గుబాటిల భేటీ!
X

దిశ, వెబ్ డెస్క్ : ఓ పుస్తకం(A Book) 3 దశాబ్దాల తర్వాత ఆ ఇద్దరు తోడల్లుళ్ల( Two In-laws)ను కలిపింది(Combined Meeting). దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ అల్లుళ్లు సీఎం చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు చాల ఏళ్ల తర్వాతా తర్వాతా కలుసుకున్నారు. తను రచించిన "ప్రపంచ చరిత్ర" పుస్తక ఆవిష్కరణ ("World History" Book Launch)కార్యక్రమానికి దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు తన తోడల్లుడైన ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని స్వయంగా ఆహ్వానించారు. చంద్రబాబును ఆయన నివాసంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao met Chandrababu Naidu at his Residence)కలిశారు. ఆయన రచించిన "ప్రపంచ చరిత్ర" (ఆది నుంచి నేటి వరకు) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉండవల్లిలో తొలిసారి సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చారు. చాలా కాలం తర్వాత ఇద్దరు తొడల్లుళ్లు కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పుస్తకావిష్కరణకు చంద్రబాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. మార్చి 6న విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. మూడు దశాబ్ధల తర్వాత తోడల్లుళ్లు చంద్రబాబు..దగ్గుబాటిలు కలుసుకున్న అరుదైన ఘట్టానికి పుస్తకావిష్కరణ కార్యక్రమం వేదికైంది. ఎన్టీఆర్ కూతుర్లలో ఒకరైన పురంధేశ్వరిని దగ్గుబాటి వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ మరో కూతురు భువనేశ్వరిని చంద్రబాబు వివాహమాడారు.

పురంధేశ్వరీ మాజీ కేంద్రమంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. కూటమి పార్టీల భేటీల సందర్భంగా దగ్గుబాటి సతీమణి పురంధేశ్వరి పలుమార్లు చంద్రబాబు నివాసానికి వచ్చారు. రెండు కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా తరచూ కలుసుకుంటూనే ఉంటున్నారు. అయితే దగ్గుబాటి, చంద్రబాబు సైతం కుటుంబ కార్యక్రమాల్లో కలుసుకుంటున్నప్పటికి బయట వారిద్ధరు కలుసుకోలేదు. చంద్రబాబు నివాసానికి దగ్గుబాటి రావడం మాత్రం దాదాపు 30ఏళ్ల తర్వాతా ఇదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇద్దరు తోడల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటిలు మామ ఎన్టీఆర్ రామారావు స్థాపించిన టీడీపీ పార్టీలో, ఆనాటి ప్రభుత్వాల్లో కీలక హోదాల్లో పనిచేశారు. 1995లో ఎన్టీఆర్ -లక్ష్మిపార్వతి ఎపిసోడ్ లో చంద్రబాబుకు దగ్గుబాటి దంపతులు సహకరించారు. తదనంతర పరిణామాలలో చంద్రబాబు నాయుడు మెల్లిగా.. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణతో పాటు దగ్గుబాటి వేంకటేశ్వరరావును టీడీపీ పార్టీ నుంచి దూరం చేశారు.

అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం వెనక తమ పాత్ర ఎంతో ఉన్నా.. ఆ తర్వాత తనను కూరలో కరివేపాకు మాదిరి తీసిపారేయడాన్ని దగ్గుబాటి దంపతులు జీర్ణించుకోలేకపోయారు. నాటి నుంచి తోడల్లుళ్లు ఇద్దరు రాజకీయ విరోధులుగా మారిపోయారు. కాలక్రమేణా నందమూరి, నారా, దగ్గుబాటి కుటంబాల మధ్య పరస్పరం అనుబంధాలు తిరిగి బలపడగా..ఇన్నాళ్లకు తోడల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటిలు కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Next Story