ఓ ఇంట్లో ప్రత్యేక్షమైన అరుదైన జంతువు.. ఒక్కసారిగా భయాందోళనకు గురైన స్థానికులు(ఫొటో వైరల్)

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-02 10:13:05  IST  )

అడవు(Forest)ల్లో అన్ని రకాల జంతువులు నివాసముంటాయి.

ఓ ఇంట్లో ప్రత్యేక్షమైన అరుదైన జంతువు.. ఒక్కసారిగా భయాందోళనకు గురైన స్థానికులు(ఫొటో వైరల్)
X

దిశ,వెబ్‌డెస్క్: అడవు(Forest)ల్లో అన్ని రకాల జంతువులు నివాసముంటాయి. అంతేకాదు ఎన్నో వింత జంతువులు సైతం అడవుల్లో దర్శనమిస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో అడవుల్లో ఉండే అరుదైన జంతువులు ఇళ్లలోకి ప్రవేశించి హల్‌చల్ సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా అడవుల్లో పెద్ద పులులుతో పాటు చిరుతలు(Leopards), సింహాలు(lions), జింకలు(deer), ఇతర అరుదైన జంతువులు కూడా కనిపిస్తుంటాయి. అయితే అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామంలోకి అడవి జంతువులు, జింకలు, ఇతర వన్యప్రాణులు రైతులు పొలాల్లోకి చొరబడి నష్టం కలిగిస్తున్న ఘటనలు కూడా ఇటీవల చోటుచేసుకున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని తాడేపల్లి(Tadepally)లో అరుదైన పిల్లి జాతి జంతువు ప్రత్యక్షమైంది. తాడేపల్లి కొండపై నుంచి ముగ్గురోడ్డులోని గొట్టిముక్కల లాజర్ అనే వ్యక్తి ఇంట్లోకి ఆ వింత జంతువు పిల్లి ప్రవేశించింది. ఆ జంతువు కళ్లు చూస్తే అచ్చం పిల్లి కళ్ల వలే ఉన్నాయి. దాని తోక పొడవుగా ఉంది. నలుపు రంగులో ఉంది. ఈ క్రమంలో పిల్లిని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. పలువురు అక్కడికి చేరుకున్న అనంతరం దానిని చాకచాక్యంగా బంధించి అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే అటవీశాఖ అధికారులు(Forest officials) ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇది చాలా అరుదైన జీవి అని, ఆఫ్రికా అడవుల్లో సంచరించే సివర్ట్ జాతికి చెందిన పిల్లిగా అధికారులు గుర్తించారు. అనంతరం పిల్లికి ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి అడవిలో విడిచిపెడతామని వారు తెలిపారు.

Next Story