- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హల్ చల్ చేసిన పిచ్చికుక్క... ఒకేసారి 40 మంది పై దాడి
మంచిర్యాల పట్టణంలోని రామ్ నగర్, ఎల్‌ఐసీ కాలనీలో ఒక కుక్క రెచ్చి పోయింది.

X
దిశ, మంచిర్యాల టౌన్: మంచిర్యాల పట్టణంలోని రామ్ నగర్, ఎల్‌ఐసీ కాలనీలో ఒక కుక్క రెచ్చి పోయింది. ఒకే సారి 40 మంది పై దాడి చేసి, విచక్షణ రహితంగా గాయపరిచింది. దీంతో గాయాల పాలైన వారు మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్‌లో చేరారు. రెండు రోజుల క్రితమే పిచ్చి పట్టిన కుక్క కాలనీ లో తిరుగుతుందని మున్సిపల్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ వారు పట్టించుకోలేదని, గతంలోను పిచ్చి కుక్కలు కొన్ని కాలనీల్లో తిరిగుతూ పలువురిపై దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు తెలిపారు. ఈ రోజు ఉదయం నుండి కుక్క కాలనీలో తిరుగుతూ ,కనిపించిన వారినీ కరుస్తుందని, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి అంటేనే భయంగా ఉందని కాలనీ వాసులు తెలిపారు.
Read More..
జర్నలిస్టుపై వైసీపీ కార్యకర్తల దాడి.. మాణిక్కం ఠాగూర్ సెన్సేషనల్ ట్వీట్
Next Story






