రాజస్థాన్‌లో అనుమానిత ప్రక్షేపకం కలకలం.. విచారణ చేపట్టిన సెక్యూరిటీ సిబ్బంది

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-09 06:51:26  IST  )

రాజస్థాన్ అనుమానిత ప్రక్షేపకం కలకలం రేపింది..

రాజస్థాన్‌లో అనుమానిత ప్రక్షేపకం కలకలం.. విచారణ చేపట్టిన సెక్యూరిటీ సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్(Rajasthan) అనుమానిత ప్రక్షేపకం(Projectile) కలకలం రేపింది. జైసల్మేర్‌(Jaisalmer)లో స్థానికులు ప్రక్షేపకం లాంటి వస్తువును భూమిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం చేశారు. దీంతో భద్రతా దళాలు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రక్షేపకం ఎలా వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో పౌరులే లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం డ్రోన్స్, మిస్సైల్స్‌తో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాలపై గురువారం రాత్రి సమయంలో డ్రోన్స్ బాంబు దాడులను పాకిస్థాన్ సైన్యం ప్రయోగించింది. అయితే ఈ దాడులను భారత సైన్యం దీటుగా ఎదుర్కొంది. దాదాపు 50కి పైకి డ్రోన్లను ధ్వంసం చేసింది. కొన్ని చోట్ల ఈ దాడుల వల్ల పౌరుల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఈ నేపధ్యంలో రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఒక ప్రక్షేపకం లాంటి వస్తువు కనిపించడం ఆందోళనకు గురి చేసింది.

Next Story