Ap News: మళ్లీ విశాఖకు ప్రతిష్టాత్మక సంస్థ.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-03-27 03:38:46  IST  )

ఏపీకి ప్రతిష్టాత్మక సంస్థ తిరిగి రాబోతోంది....

Ap News: మళ్లీ  విశాఖకు ప్రతిష్టాత్మక సంస్థ..  వెల్లువెత్తుతున్న ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)కి ప్రతిష్టాత్మక సంస్థ తిరిగి రాబోతోంది. 2014-19 హయాంలో రాష్ట్రంలో ఆ సంస్థ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. భూములు సైతం కేటాయించింది. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం తీరుతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మళ్లీ రాష్ట్రం వైపు చూసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. వెంటనే ఓకే చెప్పిన ప్రభుత్వం.. యథావిథిగా పాత కేటాయింపులకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన ప్రతిష్టాత్మక సంస్థ మళ్లీ రాబోతోంది. త్వరలోనే నిర్మాణ పనులు మొదలు పెట్టబోతోంది.

2014-19 సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) రాష్ట్రాన్ని డెవలప్‌మెంట్ చేసేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఇందులో భాగంగా పలుచోట్ల కంపెనీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రతిష్టాత్మక సంస్థ లూలూ గ్రూప్‌నకూ అనుమతులు ఇచ్చారు. విశాఖ హార్బర్ పార్క్(Visakhapatnam Harbour Park) సమీపంలో 13.88 ఎకరాలు కేటాయించారు.

అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్(Ys Jagan) అధికారంలోకి రావడం, వెంటనే చంద్రబాబు తీసుకొచ్చిన కంపెనీలు, సంస్థలపై కక్ష సాధింపులకు దిగడం జరిగింది. దీంతో లూలూతో పాటు పలు కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. ఆ తర్వాత రాష్ట్రం వైపు చూడలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఒక్కొక్క కంపెనీ రాష్ట్రం వైపు చూస్తున్నాయి. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబును ఆ సంస్థల యజమానులు కలుస్తున్నారు. తమ కంపెనీలు, సంస్థల స్థాపనపై విజ్ఞప్తులు చేస్తున్నారు. దీంతో గతంలో కేటాయించిన భూముల్లోనే ఆ సంస్థలు, కంపెనీల నిర్మాణాలకు చంద్రబాబు అనుమతులు ఇస్తున్నారు.. ఇలా రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన లూలూ గ్రూప్ మళ్లీ తిరిగి వస్తోంది. దీంతో ప్రభుత్వంపై విశాఖ వాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story