రాష్ట్రంలో కలకలం.. అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు భారీ కుట్ర...?

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-29 11:40:42  IST  )

రాష్ట్రంలో అధికార ఎమ్మెల్యే హత్య ప్లాన్ కలకలం రేపుతోంది...

రాష్ట్రంలో కలకలం.. అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు భారీ కుట్ర...?
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అధికార ఎమ్మెల్యే హత్య ప్లాన్ కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Tdp Mla Kotam Reddy Sridhar Reddy) హత్యకు ఐదుగురు రౌడీషీటర్లు ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కోటంరెడ్డిని హత్య చేసే భారీగా డబ్బులు వస్తాయని సంభాషించుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. రౌడీ షీటర్లు జగదీశ్, మహేశ్, వినీత్ మధ్య చర్చ జరిగింది. రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరుడు జగదీశ్ అని పోలీసులు గుర్తించారు. ఇక శ్రీధర్ రెడ్డి హత్యకు రౌడీ షీటర్లు ప్లాన్ చేస్తున్న వీడియో తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు రాబడతామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుపుతున్నామని ఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నారు.

Next Story