- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి.. మంత్రి సత్యకుమార్ కీలక ఆదేశాలు
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర విషాదం నెలకొంది. పీజీ ఫైనలియర్ చదువుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ దీపిక ఇవాళ తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ (Vijayawada) ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర విషాదం నెలకొంది. పీజీ ఫైనలియర్ చదువుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ దీపిక (Deepika) ఇవాళ తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆసుపత్రి ప్రాంగణంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. అయితే, ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) తక్షణమే స్పందించారు. దీపిక మరణానికి దారితీసిన కారణాలను క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు (Rajashekar Babu)ను ఆదేశించారు. ఈ కేసులో ఏ చిన్న కోణాన్ని వదలకుండా నిగ్గుతేల్చాలని స్పష్టం చేశారు.
సూపరింటెండెంట్‌తో సమీక్ష..
అదేవిధంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏడుకొండలు (Yedukondalu)తో మంత్రి సత్యకుమార్ ఫోన్‌లో మాట్లాడి వివరాలు సేకరించారు. ఘటన జరిగిన సమయంలో పరిస్థితులు, ఆసుపత్రిలో భద్రత ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. తదుపరి విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్ దీపిక మరణవార్త విని దిగ్భ్రాంతికి గురైన ఆమె తండ్రిని మంత్రి ఫోన్‌లో పరామర్శించారు. బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని, బాధ్యులెవరైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మరణానికి గల అసలు కారణాలు తెలిసే అవకాశం ఉంది.






