నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం.. భయంతో పరుగులు తీసిన జనం

by Vemula.Srinu Prasad |

కొత్తగా కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ బైక్ అందరూ చూస్తుండగా దగ్ధం అయింది..

నడిరోడ్డుపై ఎలక్ట్రిక్ బైక్ దగ్ధం.. భయంతో పరుగులు తీసిన జనం
X

దిశ, వెబ్ డెస్క్: కొత్తగా కొనుగోలు చేసిన ఎలక్ర్టిక్ బైక్(Electric Bike) అందరూ చూస్తుండగా దగ్ధం అయింది. పార్క్ చేసిన పది నిమిషాల్లో అగ్నికి ఆహుతైంది. బైక్ నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో జనం పరుగులు పెట్టారు. ఈ ఘటన అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా రావులపాలెం(Ravulapalem)లో జరిగింది.

పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు పరిధి నిక్కపూడి(Nikkapudi)కి చెందిన సత్తి పెద్దిరెడ్డి కొద్దిరోజుల క్రితం ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేశారు. నిక్కపూడి నుంచి బైక్‌పై రావులపాలెం(Ravulapalem) వెళ్లారు. అక్కడ రోడ్డు పక్కన పార్క్ చేశారు. అయితే పార్క్ చేసిన పది నిమిషాలకే బైక్ తగలబడింది. అందరూ చూస్తుండగా కాలి బూడిదైంది. దీంతో పెద్దిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బండిపెడితే దానికదే అంటుకుపోయిందని తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరారు. కాలుష్యం నివారణ కోసం ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేస్తే ఇలా తెచ్చేమో లేదో అలా తగలబడిపోయిందని పెద్దిరెడ్డి వాపోయారు.

Next Story