ఢిల్లీలో కొత్త యుగం మొదలు: చంద్రబాబు వ్యాఖ్యలు

by Thanuru Gopichand |

ఢిల్లీలో కొత్త యుగం ప్రారంభమైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో కొత్త యుగం మొదలు: చంద్రబాబు వ్యాఖ్యలు
X

దిశ డైనమిక్ బ్యూరో : ఢిల్లీలో కొత్త యుగం ప్రారంభమైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖ గుప్తా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో కొత్త మార్పులు మనం చూడబోతున్నాం అన్నారు. బీజేపీ పాలనలో ప్రతి పౌరుడు సంతోషంగా ఉంటాడని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో రాబోయే రోజుల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. గతపదేళ్లలో ఢిల్లీలో వెనకబాటు గురైందని ఇప్పుడు కొత్తయుగం మొదలైందని ఆయన పేర్కొన్నారు. వేదికపై ఉన్న చంద్రబాబును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆప్యాయంగా పలకరించారు. కొద్దిసేపు వారిద్దరూ నవ్వుతూ మాట్లాడుకున్నారు.

Next Story