- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ కోసం గొడవ.. విషాదం...!
మొబైల్ ఫోన్ కోసం జరిగిన చిన్న గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది...

దిశ, మాధవరం: మొబైల్ ఫోన్ కోసం జరిగిన చిన్న గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మాధవరం పోలీస్ స్టేషన్ ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన హరిజన జేమ్స్ (తండ్రి దావీదు) కుమార్తె H. లావణ్య (15) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో 9వ తరగతి చదువుతోంది. ఆమె అన్న H. చరణ్ కూడా అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.నిన్నటి దినం పాఠశాల ముగిసిన తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చి భోజనం చేశారు. ఆ తర్వాత సెల్ ఫోన్ వాడుకునే విషయంలో అన్న చెల్లెలి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు కుమార్తె లావణ్యను మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక, జీవితంపై విరక్తి చెంది క్షణికావేశంలో పక్కనే ఉన్న తన అవ్వ ఇంటికి వెళ్ళింది. అక్కడ చిన్నపిల్లల కోసం చీరతో కట్టిన ఊయలకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాధవరం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేయించి, అనంతరం దేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్ఐ విజయ్ కుమార్ వెల్లడించారు. బాలిక మృతితో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి






