- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amaravathi: అవకాశాల గని.. అమరావతి
రాజధాని అమరావతిలో అద్భుతమైన అవకాశాలు రానున్నాయని చంద్రబాబు నాయుడు తెలిపారు.

హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేసి చూపిస్తాము
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
విజయవాడలో ఫిక్కీ జాతీయ సమావేశం
దిశ డైనమిక్ బ్యూరో : రాజధాని అమరావతిలో అద్భుతమైన అవకాశాలు రానున్నాయని చంద్రబాబు నాయుడు తెలిపారు. భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య (FICCI) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ విజయవాడలో ఏర్పాటు చేసిన జాతీయ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రసంగించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనేక రకాల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. టెక్నాలజీ మన జీవితంలో భాగంగా మారుతుంది అన్నారు. హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. మొదట్లో బిజినెస్ పీపుల్‌తో రాజకీయ నాయకులు మాట్లాడే వారు కాదన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లవద్దని సూచించే వారని ఆయన పేర్కొన్నారు. అయినా తాను పలుమార్లు దావోస్‌కు వెళ్లి పారిశ్రామికవేత్తతో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించానని ఆయన చెప్పారు.
నాటి ప్రధాని పీవీ నరసింహరావు ప్రపంచీకరణ కు అనుమతి ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ చక్కబడిందని ఆయన తెలిపారు. వికసిత్భారత్అనేది ప్రధాని మోదీ లక్ష్యం అన్నారు. మోడీ ఆధ్వర్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోంది అని చంద్రబాబు పేర్కొన్నారు. డ్రోన్స్ తో రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ చేసే విధంగా అభివృద్ధి జరిగిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అన్నారు. కాంపిటీటివ్ ఎకానమీలో మనం ముందుకు వెళ్తున్నా మని చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిలో మంచి అవకాశాలు రానున్నాయి అని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ (Swarnandhra Vision) అనేది మన లక్ష్యం కావాలన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలన్నారు. గత ఏడాది కాలంలో 25 క్యాబినెట్ మీటింగ్లను నిర్వహించామన్నారు. పరిశ్రమలకు చెందిన అన్ని అనుమతులను మంజూరు చేసినట్లు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ప్రస్తుతం మనం క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడుతున్నామన్నారు. ఫిక్కీ 100 ఏళ్లకుపైగా ఉన్న సంస్థ అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. స్వర్ణాంధ్ర సాకారం చేసేందుకు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటందని ఫిక్కీ జాతీయ కార్యవర్గం వెల్లడించింది ప్రభుత్వ చేపడుతున్న చర్యలు, పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటున్నాయని ఫిక్కీ ప్రతినిధులు తెలిపారు. ఎంఎస్‌ఎంఈల విషయంలో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు ఫిక్కి అభినందనలు తెలిపింది.






