- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ,కడప: కార్పొరేట్ కళాశాలలకే కాదు ప్రభుత్వ కళాశాలల్లో కూడా అత్యుత్తమ పలితాలు వస్తాయని ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్ధి నిరూపించాడు. రాయచోటి బాలల జూనియర్ కళాశాలో మొదటి సంవత్సరం చదువుతున్న షేక్ ఆరీఫుల్లా బైపీసీ భాగంలో 460 మార్కులకుగాను 431 మార్కులతో ప్రథమ స్థాయిలో ఉత్తీర్ణుడయ్యారు.
మొదటి సంవత్సరంలోనే తన ప్రతిభను నిరూపించుకున్న విద్యార్థి షేక్ ఆరీఫుల్లాను ఆ కళాశాల అధ్యాపక బృందం అభినందించింది. మంచి మార్కులు సాధించిన సందర్భంగా ఆ విద్యార్థి, అందుకు కారణమైన కళాశాల అధ్యాపకులకు, తలిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలలో అధ్యాపకులు మెరుగైన విద్యాబోధన అందించడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఏర్పడిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Next Story






