Breaking: విశాఖలో మెడికో ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |

విశాఖలో మెడికో(Medico) ఆత్మహత్య చేసుకున్నారు. ..

Breaking: విశాఖలో మెడికో ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Vishaka)లో మెడికో(Medico) ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్నారై మెడికల్ కాలేజీ‌(NRI Medical College)పై నుంచి కిందకు దూకి విద్యార్థి బలవన్మరణానికి(Suicide) పాల్పడ్డారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి(Vice Principal Sridhar Reddy) వేధింపులు కారణంగా విద్యార్థి శ్రీరామ్(Student Sriram) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. శ్రీధర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు శ్రీరామ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తన కుమారుడు శ్రీరామ్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి శ్రీరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story