- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాట నిలబెట్టుకున్న మాస్టారు: టెన్త్ టాపర్‌కు విమాన ప్రయాణం బహుమతి
విజయనగరం జిల్లా చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుడు మిరియాల కృష్ణారావు విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచేందుకు ఒక వినూత్నమైన ప్రకటన చేశారు. ..

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా(Vijayanagaram) చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాల(Cheepurupalli Boys High School)లో పనిచేస్తున్న జీవశాస్త్ర ఉపాధ్యాయుడు మిరియాల కృష్ణారావు(Biology teacher Miriyala Krishna Rao) విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంచేందుకు ఒక వినూత్నమైన ప్రకటన చేశారు. పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని తన సొంత ఖర్చులతో విమానం ఎక్కిస్తానని ఆయన గతంలో హామీ ఇచ్చారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఎలకల హేమంత్ అనే విద్యార్థి అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాల స్థాయిలో టాపర్‌గా నిలవడంతో ఆ ఉపాధ్యాయుడు తన మాటను నిలబెట్టుకున్నారు.
సొంత డబ్బులతో..
ప్రకటించిన విధంగానే ఉపాధ్యాయుడు కృష్ణారావు తన సొంత డబ్బులతో హేమంత్‌ను విశాఖపట్నం నుండి విజయవాడకు విమానంలో తీసుకెళ్లారు. తొలిసారి గగన విహారం చేసిన ఆ విద్యార్థి ఆనందానికి అవధులు లేవు. విద్యార్థులలో ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని పెంపొందించడానికి, వారిని మరింతగా ప్రోత్సహించడానికి ఇటువంటి వినూత్న బహుమతులు ఎంతగానో ఉపయోగపడతాయని ఉపాధ్యాయుడు అభిప్రాయపడ్డారు.
సచివాలయాన్ని సందర్శించిన విద్యార్థి
విజయవాడ చేరుకున్న అనంతరం వారిద్దరూ కలిసి రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయాన్ని సందర్శించారు. వీటితో పాటు హైకోర్టు, సైన్స్ మ్యూజియం, భవాని ద్వీపం వంటి పర్యాటక, విద్యాసంబంధిత ప్రాంతాలను కూడా సందర్శించనున్నారు. కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, విద్యార్థుల కలలను నిజం చేస్తూ స్ఫూర్తిగా నిలిచిన ఈ గురువుపై స్థానికులు , విద్యావేత్తలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.






