Vijayawada: ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. పోలీసులకు ఫిర్యాదు

by srinivas |   ( Updated:2025-04-16 01:02:27.0  )
Vijayawada: ఇంద్రకీలాద్రిపై భారీ చోరీ.. పోలీసులకు ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: దుర్గమ్మ దర్శనానికి వెళ్తే మొత్తం దోచేశారు. ఈ ఘటన విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగింది. కారులో అమలాపురం పెళ్లికి వెళ్తూ భక్తులు ఇంద్రకీలాద్రిపైకి వెళ్లారు. ఓంకారం టర్నింగ్ పాయింట్ వద్ద కారును నిలిపి పూజా సామాగ్రి కోసం వెళ్లారు. తిరిగి వచ్చే సరికి కారులో ఉంచిన బంగారం మాయం అయింది. దీంతో కంగారు పడిన భక్తులు అటూ ఇటూ చూశారు. ఎవరూ అనుమానాస్పదంగా కనిపించకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. 25 కాసులకు పైగా బంగారం పోయిందని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు మాత్రం లబోదిబోమంటున్నారు. దొంగలను త్వరగా గుర్తించాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed