స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో మోసం.. దంపతుల సహా నలుగురి అరెస్ట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-30 03:07:21  IST  )

విశాఖపట్నంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులపేరుతో జరిగిన భారీ మోసం కలకలం రేపింది. అధిక లాభాలు వస్తాయనే ఆశతో అమాయక ప్రజలు సుమారు ఆరున్నర కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడిగా పెట్టి మోసపోయారు...

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో మోసం.. దంపతుల సహా నలుగురి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం(Visakhapatnam)లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల(Stock market investments) పేరుతో జరిగిన భారీ మోసం(Fraud) కలకలం రేపింది. అధిక లాభాలు వస్తాయనే ఆశతో అమాయక ప్రజలు సుమారు ఆరున్నర కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడిగా పెట్టి మోసపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన విచారణ చేపట్టి ఈ మోసపూరిత వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన సూత్రధారులైన దంపతులతో పాటు మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కీలక పత్రాలను, కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసిన ఈ ముఠా, ఆ డబ్బును ఇతర అవసరాలకు మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

మోసపోవద్దు...

తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు వస్తాయని ఎవరైనా నమ్మబలికితే మోసపోవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ వంటి పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు, అనధికార సంస్థలకు డబ్బులు ఇచ్చి ఆర్థికంగా నష్టపోవద్దని పోలీసులు స్పష్టం చేశారు.

Next Story