స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున పేలుడు శబ్ధం

by Vemula.Srinu Prasad |

కర్నూలు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు మండలంలోని జైరాజ్ స్టీల్ ప్లాంట్‌లో పెద్ద ఎత్తున పేలుడు శబ్దంతో మంటలు ఎగిసిపడ్డాయి...

స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున పేలుడు శబ్ధం
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు మండలంలోని జైరాజ్ స్టీల్ ప్లాంట్‌లో పెద్ద ఎత్తున పేలుడు శబ్దంతో మంటలు ఎగిసిపడ్డాయి. అంతేకాకుండా మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ మేరకు ప్లాంట్ ప్రాంగణం మొత్తం గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంతో ప్లాంట్‌ నుంచి దట్టమైన పొగ వెలువడింది. ఈ పొగ ఓర్వకల్లుతో పాటు గుట్టపాడు గ్రామాన్నీ కమ్మేసింది. కిలోమీటర్ల మేర ఆకాశంలోకి ఎగిసిపడుతున్న పొగను చూసి గ్రామస్తులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఒక్కసారిగా పెరిగిన వాయి కాలుష్యం

ఈ ఘటనలో అటు వాయు కాలుష్యం సైతం ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడిపోయారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ మేరకు మంటలను అదుపు చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Next Story