- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ పోయిందని కేసు పెడితే దిక్కుల లేదు కానీ చలాన్లు వేస్తారా? బెజవాడలో వ్యక్తి వింత నిరసన
విజయవాడలో ఓ వ్యక్తి వినూత్న నిరసనకు దిగాడు. బైక్ పోయినప్పుడు కేసు పెడితే పట్టుకోలేని పోలీసులు కొత్త బండి కొనుక్కుంటే ఫైన్ వేసే అధికారం ఎక్కడని ప్లకార్డు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైటాయించాడు.

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో ఓ వ్యక్తి వినూత్న నిరసనకు దిగాడు. బైక్ పోయినప్పుడు కేసు పెడితే పట్టుకోలేని పోలీసులు కొత్త బండి కొనుక్కుంటే ఫైన్ వేసే అధికారం ఎక్కడని ప్లకార్డు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైటాయించాడు. ఆ వ్యక్తి సీపీ ఆఫీస్ ముందే నిరసన తెలపడంతో పోలీసులు అక్కడకు చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అతడు నిరసన విరమించుకోలేదు. దీంతో పోలీసులు అతడిని బలవంతంగా స్టేషన్ కు తరలించారు. ఇక మూడేళ్ల క్రితం బైక్ పోవడంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
స్టేషన్ చుట్టూ తిరిగినా మూడేళ్ల నుండి బైక్ దొరక్కపోవడంతో తీవ్ర నిరాశ చెందినట్టు చెబుతున్నాడు. ఇప్పుడు కొత్త బైక్ తీసుకుని రోడ్డు మీదకు వస్తే వచ్చీ రాగానే ఛలాన్ వేయడంతో ఆవేదనతో నిరసనకు దిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యక్తి నిరసన తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సైతం ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు. అతడి బైక్ పోయినప్పుడు మూడేళ్లు అయినా తీసుకురాలేనివాళ్లు ఇప్పుడు ఎలా ఫైన్ వేస్తారని ప్రశ్నిస్తున్నారు.






