చిత్తూరు జిల్లాలో దారుణం..ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి

by Vemula.Srinu Prasad |

చిత్తూరు జిల్లాలో గజరాజులు ఓ వ్యక్తిపై దాడి చేసి తొక్కి చంపేశాయి...

చిత్తూరు జిల్లాలో దారుణం..ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District)లో గజరాజులు ఓ వ్యక్తిపై దాడి చేసి తొక్కి చంపేశాయి. సోమల మండలం ఆవులపల్లి పంచాయతీకి చెందిన రైతు రామకృష్ణంరాజు(Farmer Ramakrishnam Raju) రోజు మాదిరిగా తన పొలానికి వెళ్లారు. అయితే స్థానికంగా అడవుల నుంచి రామకృష్ణ పొలంలోకి ఏనుగుల గుంపు వచ్చాయి. అయితే ఏనుగులను రైతు రామకృష్ణ తరిమే ప్రయత్నం చేశారు. దీంతో రైతుకి పైకి వెళ్లిన ఏనుగులు దాడి చేసి చంపేశాయి.

జూన్ నెలలోనూ ఇదే జిల్లాలో ఏనుగు దాడిలో ఓ రైతు మృతి చెందారు. నాగవాండ్లపల్లికి చెందిన రైతు గణపతి యాదవ్ రాత్రి సమయంలో తన పొలం వద్ద నిద్రిస్తున్నారు. ఇంతలో ఏనుగుల గుంపు వచ్చింది. అయితే ఈ గుంపును గణపతి దారిమళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఓ ఏనుగు దాడి చేయడంతో గణపతి అక్కడికక్కడే మృతి చెందారు.

Next Story