- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నదిలో ఇరుక్కున్న బోట్లు.. పెన్నా వారధికి తప్పిన పెను ప్రమాదం
నదిలో ఇరుక్కున్న బోట్లు.. పెన్నా వారధికి తప్పిన పెను ప్రమాదం

X
దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని నెల్లూరు జిల్లాలో పెన్నా నదిలో ఇరుక్కున్న బోట్లను ఎట్టకేలకు వెలికితీశారు. పెన్నా నదిలో ఇసుక తవ్వకాల కోసం తెప్పించి రెండురోజుల క్రితం తాడుతో బోట్లను కట్టేశారు. వర్షాలకు నది ప్రవాహం పెరిగి తాళ్లు తెగిపోయాయి. దీంతో మూడు బోట్లు కొట్టుకుపోయాయి. డ్రోన్ల ద్వారా బోట్లు కొట్టుకుపోవడం SDRF సిబ్బంది గమనించి, బుధవారం రెండు పడవలను గట్టుకు తరలించిన అధికారులు.. నేడు 35 టన్నుల బరువున్న భారీ బోటును గజ ఈతగాళ్ల సహాయంతో బయటకు తీశారు. ఆ పడవ అలాగే కిందకు వెళ్తే.. పెన్నా వారధి గేట్లకు ఢీకొని భారీ నష్టం వాటిల్లేదని అధికారులు తెలిపారు. తాజాగా దాన్ని బయటకు తీయడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. సమయానికి రంగంలోకి దిగిన టీం అందరి సమిష్టి కృషికి అభినందనలు తెలిపారు.
Next Story






