- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ లిక్కర్ కేసులో పెను సంచలనం.. జోగి రమేశ్, ఏ1 జనార్ధన్ రావు ఫొటోలు వైరల్
నకిలీ లిక్కర్ కేసులో పెను సంచలనం నమోదు చేసుకుంది. ...

దిశ, వెబ్ డెస్క్: నకిలీ లిక్కర్ కేసు(Fake liquor case)లో పెను సంచలనం నమోదు చేసుకుంది. ఈ కేసు నిందితుడు ఏ1 నిందితుడు జనార్ధన్ రావు(Janardhan Rao)తో మాజీ మంత్రి జోగి రమేశ్(Former Minister Jogi Ramesh) దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అలాగే తంబాలపల్లికి చెందిన మరో నిందితుడు జయచంద్రారెడ్డితో లింకులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై మాజీ మంత్రి జోగి రమేశ్ క్లారిటీ ఇచ్చారు. ఓ ఛానల్ ఇంటర్వూలో పాల్గొన్న ఆయన... జనార్ధన్ రావు తనకు పరిచయస్తుడని తెలిపారు. జయచంద్రారెడ్డి ఎవరో తనకు తెలియదన్నారు. తమ వీధిలో జనార్ధన్ రావు తాత చిల్లర కొట్టు ఉండేదని, అలా తమకు తెలుసన్నారు. జనార్ధన్ రావు, జయచంద్రారెడ్డి తన క్లాస్ మేట్స్ కాదని, అది ప్రచారం మాత్రమేనన్నారు. ఎలాంటి లై డిటెక్టర్ టెస్టుకైనా తాను సిద్ధమేనని చెప్పారు. నకిలీ మద్యం కుంభకోణం రాజకీయం కాదని తెలిపారు. ఆఫ్రికా వెళ్లే ముందు జనార్ధన్ రావు తన ఇంటికి వచ్చి కలిశారనేది పచ్చి అబద్ధమని దేవుడు మీద ప్రమాణం చేసి చెబుతున్నానని జోగి రమేశ్ పేర్కొన్నారు.
కాగా అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలో నకిలీ మద్యం తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దర్యాప్తులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తోంది. విజయవాడ ఇబ్రహీంపట్నంలోనూ నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించి రైడ్ చేశారు. అయితే ఈ కేసులో ఏ1 నిందితుడు జనార్ధన్‌గా గుర్తించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లికి చెందిన జయచంద్రారెడ్డి పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో ఏ1 నిందితుడు జనార్ధన్ రావును అరెస్ట్ చేశారు. జయచంద్రారెడ్డి కోసం గాలిస్తున్నారు.
అయితే ఈ నకిలీ మద్యం తయారీ వెనుక వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ ఉన్నారని కేసు విచారణలో నిందితుడు జనార్ధన్ రావు తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేందుకే జోగి రమేశ్ కుట్ర చేశారని తెలిపారు. జోగి రమేశ్, జయచంద్రారెడ్డి స్నేహితులమని జనార్ధన్ రావు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మాజీ మంత్రి జోగి రమేశ్ మీడియా ముందుకు వచ్చారు. తనకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. జనార్ధన్ రావు పరిచయస్తుడు మాత్రమేనని, జయచంద్రారెడ్డి తనకు తెలియదని తెలిపారు.






