తిరుపతిలో భారీ అగ్నిప్ర‌మాదం.. అల్యూమినియం ఫ్యాక్టరీలో మంటలు

by Vemula.Srinu Prasad |

తిరుపతిలో భారీ అగ్నిప్ర‌మాదం జరిగింది...

తిరుపతిలో భారీ అగ్నిప్ర‌మాదం.. అల్యూమినియం ఫ్యాక్టరీలో మంటలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో భారీ అగ్నిప్ర‌మాదం(Fire Accident) జరిగింది. ఏర్పేడు మండలం చింతలపాలెం టోల్ ప్లాజా వద్ద CMR ECO అల్యూమినియం ఫ్యాక్టరీ(CMR ECO Aluminum Factory)లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో నల్లని పొగలు స్థానికంగా కమ్ముకున్నాయి. బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు కార్మికులు చెబుతున్నారు. ఘటనతో తామంతా బయటకు వచ్చామని చెప్పారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలార్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Next Story