- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో భారీ అగ్నిప్రమాదం.. బ్యాటరీ బైకుల షోరూమ్‌లో చెలరేగిన మంటలు
by Vemula.Srinu Prasad |
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tirupati)లో భారీ అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. రేణగుంట రోడ్డు(Renigunta Road)లోని బ్యాటరీ బైకుల షోరూమ్( Battery Bike Showroom)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షోరూమ్‌లోని సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు. అయితే ఈ ఘటనలో 10 బ్యాటరీ బైకులు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్య్కూట్ కారణంతోనే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో పక్కనున్న దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. సమయానికి ఫైర్ సిబ్బంది మంటలార్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






