- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: ఏలూరు శివారులో భారీ అగ్నిప్రమాదం... ఐదు కోట్ల మేర నష్టం..!
ఏలూరు శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది....

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు(Eluru) శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవరప్పాడు దుర్గ క్వాయర్ ఇంపెక్స్ ఫ్యాక్టరీ(Somavarappadu Durga Choir Impex Factory)లో మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే మంటల్లో మూడు నుంచి ఐదు కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనతో యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతోంది. మరోవైపు ఈ ఘటనతో స్థానికంగా టెన్షన్ వాతావరణం కొనసాగింది. మంటలతో పాటు నల్లని పొగలు అలముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






