లోయలోకి దూసుకెళ్లిన లారీ... ఒడిశా కార్మికులకు తప్పిన భారీ ప్రమాదం

by Vemula.Srinu Prasad |

పోలవరం జిల్లా ఈతలపాడులో పెను ప్రమాదం తప్పింది. అదుపులోకి లోయలోకి లారీ దూసుకెళ్లి బోల్తా పడింది...

లోయలోకి దూసుకెళ్లిన లారీ... ఒడిశా కార్మికులకు తప్పిన భారీ ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: పోలవరం జిల్లా(Polavaram District) ఈతలపాడు(Eethalapadu)లో పెను ప్రమాదం తప్పింది. అదుపులోకి లోయలోకి లారీ(Lorry) దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ సమయంలో ఆరుగురు ప్రయాణికులు లారీలో ఉన్నారు. రాజమండ్రి(Rajahmundry) నుంచి బొండ్లక(Bondlaka)కు సెట్రింగ్ లోడుతో వెళ్తుండగా లంబసింగి జాతీయ రహదారి(Lambasingi National Highway)పై యాక్సిలెటర్ రాడ్ విరిగిపోవడంతో లారీ తప్పింది. అయితే ఈ లారీ వెనుక వేరే వాహనం లేకపోవడంతో ప్రమాదం నుంచి డ్రైవర్, క్లినర్‌తో పాటు నలుగురు ఒడిశా కార్మికులు సైతం బయటపడ్డారు. స్థానికులు సహాయం అందించి లోయలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు లోయలో పడిన లారీని క్రేన్ సాయంతో బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story