- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో.. కొద్దిలో 60 మంది విద్యార్థులు మిస్ అయ్యారు.. లేదంటేనా..?
వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది...

X
దిశ, వెబ్ డెస్క్: కర్నూలు బస్సు ప్రమాదాన్ని మర్చిపోకముందే మరో ఘటన బెంబేలెత్తించింది. అయితే ఇక్కడ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపరిపల్చుకున్నారు. కానీ ఒక్కొక్కరికి గుండెల్లో రైళ్లు పెరిగెత్తాయి. వైఎస్సార్ కడప జిల్లా గోపవరం మండలం సండ్రపల్లెలో ప్రైవేటు స్కూలుకు చెందిన 60 విద్యార్థులకు భారీ ప్రమాదం తప్పింది. బస్సులో స్కూలుకు వెళ్తుండగా స్థానిక చెరువు కట్ట వద్ద ఒక్కసారిగా ఓ వైపునకు ఒరిగిపోయింది. ఏ మాత్రం కిందకు జారినా ఈ రోజు మరో పెను ప్రమాదం జరిగి ఉండేది. బస్సు వెనుక భాగం చెరువుకట్ట అంచువరకు వెళ్లి ఆగిపోయింది. అయితే విద్యార్థులంతా చాకచక్యంగా కిందకు దిగారు. దీంతో అక్కడనున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు కొద్దిలో పెను ప్రమాదం తప్పిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
Next Story






