విజయవాడలో షాకింగ్.. ఒక్కసారిగా కూలిపోయిన నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-24 14:57:28  IST  )

విజయవాడలో భారీ ప్రమాదం తప్పింది..

విజయవాడలో షాకింగ్..  ఒక్కసారిగా కూలిపోయిన నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో భారీ ప్రమాదం తప్పింది. నగరంలో రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు కూడా వర్షం(Rain) పడింది. అయితే బందర్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న షాపింగ్ మాల్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పక్క భవనం, రోడ్డుపై భారీ ఐరన్ గడ్డర్లు పడ్డాయి. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను విషాదం(Tragedy) తప్పింది. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు.. ఘటనా స్థలానికి వెళ్లారు. శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బిల్డింగ్ కూలిన సమయంలో భారీ శబ్ధం రావడంతో స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో తెలియక అందరూ రోడ్డుపైకి వచ్చారు. షాపింగ్ మాల్ కూలిపోవడాన్ని చూసి షాక్‌కు గురయ్యారు.

Next Story