విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పేలి పోయిన ట్రాన్స్‌ఫార్మర్లు.. తప్పిన పెను ప్రమాదం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-15 16:31:18  IST  )

కడప జిల్లా మైలవరం మండలం సోలార్ పార్కులోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి అక్కడునన ట్రాన్స్‌ఫార్మర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి...

విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పేలి పోయిన ట్రాన్స్‌ఫార్మర్లు.. తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా మైలవరం మండలం సోలార్ పార్కులోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పెను ప్రమాదం తప్పింది. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి అక్కడునన ట్రాన్స్‌ఫార్మర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. దీంతో క్షణాల్లోనే విద్యుత్ కేంద్రం అంతటా మంటలు వ్యాపించాయి. వెంటనే దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

ఈ అగ్నిప్రమాదంలో ...

ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. అయితే ప్రమాద సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. విద్యుత్ పరికరాలు కాలి బూడిదవ్వడంతో ఉత్పత్తికి తాత్కాలికంగా ఆటంకం కలిగిందని చెప్పారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఇతర విద్యుత్ కేంద్రాల్లోనూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story